అమరావతి – కాకినాడలో బియ్యం అక్రమ రవాణా పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ అక్రమాలనై విచారణకు అయిదుగురు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ కి వినీత్ బ్రిజ్ లాల్ ను నేతృత్వం వహిస్తారు. ఈ సిట్ బియ్యం అక్రమ రవాణా పై నమోదు అయిన కేసులన్నింటినీ విచారించనుంది. ప్రతీ 15 రోజులకు ఒకసారి కేసు విచారణలో పురోగతి పై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్ కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ, హోం సెక్రటరీకి సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
SIT – బియ్యం అక్రమ రవాణా … వినీత్ బ్రిజ్ లాల్ నేతృతంలో సిట్ ఏర్పాటు
Advertisement
తాజా వార్తలు
Advertisement