ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి సిట్ ఛీప్ కొల్లి రఘురామిరెడ్డిని పంపించేసింది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ.
అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు పంపించింది ఎన్నికల సంఘం. ఈసీ ఆదేశాల నేపథ్యంలో కొల్లి రఘురామిరెడ్డి అస్సాం వెళ్లి గువహటి కేంద్రంగా ఆయన పని చేయాల్సి ఉంది.
చంద్రబాబును ఆరెస్ట్ చేసింది ఆయనే..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కళ్లు, చెవులు మొత్తం రఘురామిరెడ్డే అని పోలీస్ వర్గా్ల్లో భాగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం ఇతర విధులకు కేటాయించడం హాట్ డిస్కషన్‌గా మారింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామిరెడ్డి అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం సిట్ కార్యాలయం వద్ద కీలక కేసులో హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే రఘురామిరెడ్డి విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.