Tuesday, November 19, 2024

ఒక్క పాటతో కల సాకారం.. సింగర్ పార్వతికి ఆర్థిక సాయం

ఇటివల జీ తెలుగు టెలివిజన్ ఛానల్ లో ప్రారంభమైన సరిగమప షో లో తన మొదటి పాట తోనే రాష్ట్ర ప్రజల మన్నలను పొంది, తన అవసరాన్ని పక్కనపెట్టి తన గ్రామ అవసరం కోసం బస్సు సౌకర్యాన్ని కొరకు విజ్ఞప్తి చేసిన ఎపిసోడ్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించేలా చేసింది.

నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ తన కల సాకారం కోసం సంకల్పంతో ముందుకు వెళ్తున్న సింగర్ పార్వతికి YVR ట్రస్ట్ సహకారంతో గుంతకల్ ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి ఆదేశాల మేరకు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నైరుతిరెడ్డి  చేతుల మీదుగా రూ.51వేలు సింగర్ పార్వతి  అందజేశారు.

ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో ఉన్నప్పటికీ తమ గమనప్రయాణం ఆపకపోతే ఏదో ఒక రోజు విజయతీరాలకు చేరుతారు అనడానికి ఉదాహరణ మన సింగర్  పార్వతి.. ఇలాంటి ఆణిముత్యాలకు తమ పార్టీ ఎల్లప్పుడూ , ఎప్పటికీ తోడుఉంటుందని అదే తరుణంలో గుంతకల్ పరిసరప్రాంతంలోని కళాకారులను ప్రోత్సహించడానికి వై. వెంకటరామ్ రెడ్డి ఆధ్వర్యంలో వైవి ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అవసరమైతే వారిని బలోపేతం చేయడానికి ఆర్థికంగా ఆదుకుంటుందని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement