Wednesday, December 18, 2024

PV.Sindhu | సీఎం చంద్రబాబుకు సింధు వివాహ ఆహ్వానం.

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పివి సింధు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సింధు.. కుటుంబ సభ్యులతో క‌లిసి ప్రముఖులకు పెళ్లి కార్డులు పంచుతోంది. ఈ క్రమంలో ఆమె ఉండవల్లిలోని సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తన పెళ్లికి రావాలంటూ పెళ్లి కార్డు ఇచ్చింది.

కాగా, ఈ నెల 22న రాజస్థాన్‌లో వరుడు వెంకటదత్త సాయిని సింధు మ‌నువాడ‌నుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు విషెస్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement