ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు అయిన సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పలు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవం, సింహాద్రినాధుడి నిజరూపదర్శనం గత రెండేళ్లుగా ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. కోవిడ్ నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా ఉత్సవాలకు భక్తులను అనుమతించలేదు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో ఈ ఏడాది ఆయా ఉత్స వాలకు భక్తులను అనుమతించనున్నారు. అంతేకాకుండా అంగ రంగ వైభవంగా నిర్వహించాలని కూడా ఆలయ ఇవో ఎం.వి. సూర్యకళ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సింహాద్రినాధు డి కళ్యాణ మహోత్సవం ఏప్రి ల్ 12న వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అత్యం త వైభవంగా నిర్వహించనున్నారు. అంతకుముందు ఈనెల 18న స్వామి పెళ్లిచూపుల మహోత్సవం (డోలోత్సవం) శాస్త్రోక్తంగా నిర్వ హించనున్నారు. కళ్యాణ మహోత్సవం రోజు రాత్రి 8 గంటలకు సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో రధోత్సవం వైభ వంగా జరిపించనున్నారు. మాడ వీధుల్లో ఉభయదేవేరులతో సింహా ద్రినాధుడు రథోత్సవం కొనసాగనుంది. అదే రోజు రాత్రి 9.30 గంట లకు శుభముహుర్తాన కళ్యాణ మహోత్సవం జరిపించనున్నారు. మే 3న అప్పన్న నిజరూపదర్శనం
ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో కొలువుండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనోత్సవంగా, చందనయాత్రగా పిలుస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తన నిజరూపదర్శనం భక్తులకు కల్పించనుండడంతో ఆ రోజు స్వామిని ఎలాగైనా దర్శించుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా భావిస్తారు. అందుకు తగ్గట్లుగానే ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నా యి. సింహాద్రినాధుడు ఆలయంలో చందనోత్సవం అత్యంత ప్రాచుర్యం పొందింది. కావున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..