Tuesday, November 26, 2024

ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం…

విశాఖ‌ప‌ట్నం – సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని నిరాడంబ‌రంగా,, ఏకాంతంగా నేడు నిర్వ‌హించారు. స్వామివారు నిజరూపం దర్శనమిచ్చారు. స్వామి వారికి ప్రభుత్వం తరుపున మంత్రి అవంతి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ధర్మకర్తగా సంచయిత గజపతిరాజు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు- ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ,వచ్చే ఏడాది చందనోత్సవం లక్షలాది భక్తులతో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకొన్నట్లు ఆమె తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో పరిమిత వైదిక సిబ్బందితో ఉత్సవ నిర్వహణ చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. చందనోత్సవ ఘట్టాన్ని ఏకాంతంగా జరిపారు. దీంతో వరుసగా రెండో ఏడాది స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించ‌లేదు. ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు, అధికారులకు కూడా దర్శనానికి అనుమతి నిరాకరించారు. అప్పన్న చందనోత్సవం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్ల చేశారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement