Sunday, November 24, 2024

Simhachalam – తప్పుచేస్తే తాట తీస్తాం … ఇకపై ఎవరినీ వ‌దిలే ప్రసక్తి లేదు – హోం మంత్రి వంగలపూడి అనిత

జగన్​పై ప్రేమ ఉంటే జాబ్​ వదిలేసి వెళ్లండి
లా అండ్ ఆర్డర్ విషయంలో సీరియస్​గా ఉండాలి
సింహాచలం భూములు అన్యాక్రాంతం కానివ్వం
పంచగ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం
మీడియాతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

ఆంధ్రప్రభ స్మార్ట్​, విశాఖ ప్రతినిధి: లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. విశాఖపట్నంలో సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ కొంత మంది పోలీసు అధికారులు తమలో వైఎస్సార్​ కాంగ్రెస్‌ పార్టీ రక్తం ప్రవహిస్తున్నట్టు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై ప్రేమ ఉంటే, ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీకోసం పనిచేసుకోవాల‌ని సలహా ఇచ్చారు. కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు.

- Advertisement -

సింహాచలం భూములు అన్యాక్రాంతం కానివ్వం..

సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదని హోం మంత్రి అనిత అన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. కాగా, ఏపీ వంగలపూడి అనితతన సొంత జిల్లాలో సోమవారం పర్యటించారు. జిల్లాలోపి టీడీపీ, జనసేన పార్టీల నేతల్ని వరుసగా కలుస్తూ.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక, నిన్న (ఆదివారం) అనకాపల్లిలో మాజీ మంత్రి, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె ఈ సందర్భంలో కొణతాల రామకృష్ణ కాళ్లకు మొక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement