Tuesday, November 26, 2024

రేప‌టి నుంచి సింహాచలం అప్పన్న పవిత్రోత్సవాలు.. విశేష హోమాలు

విశాఖపట్నం (సింహాచలం), ప్రభన్యూస్‌ బ్యూరో: సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి అత్యంత వైభవంగా ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఆలయ ఇవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు మృత్యంగ్రహణం, అంకురార్పణ, హోమాలు నిర్వహిస్తారు. 6న విశేష హోమాలు, పారాయణ లు జరుపుతారు. అదే రోజు రాత్రికి అధివాసములు పారాయణలు నిర్వహిస్తారు. 7న విశేష హోమాలు, పారాయణలు, రాత్రికి పవిత్రాలు సమర్పణ గావిస్తారు.

8వ తేదీన‌ విశేష హోమాలు, పారాయణలు జరిపి రాత్రికి పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రధబలి కార్యక్రమాలు జరుపుతారు. 9న ఉదయం ఏకాంత స్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ఈనెల 5 నుంచి 9 వరకు సింహాద్రినాధుడి అన్ని ఆర్జిత సేవలు, నిత్యకళ్యాణం రద్దు చేయడం జరిగిందని ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ప్రతీ రోజు రాత్రి 7 తరువాత స్వామి దర్శనాలు భక్తులకు లభించవని ఆలయ ఇవో భ్రమరాంబ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement