సింహచలం – అప్పన్న ఆలయంలో మరోసారి అపచారం జరిగింది.. ఈ నెల 23వ తేదీన నిర్వహించిన సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం కార్యక్రమ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని భక్తులు. ఓ వైపు వేడుక జరుగుతుండగానే బయటకు వచ్చాయి ఫొటోలు, వీడియోలు.. స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది.. గత ఏడాది తొలిసారి బయటకు వచ్చాయి అప్పన్న అంతరాలయ వీడియోలు.. ఇప్పుడు మరోసారి ఫొటోలు, వీడియోలు బయటకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామంటూ ఆలయ ఆధికారులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement