Tuesday, November 19, 2024

‘సింహగర్జన’కు తరలిరండి..

తిరుపతి ప్రభ న్యూస్…రెండు లక్షల మంది సిపిఎస్.ఉద్యోగులు వారి కుటుంబాలకు భవిష్యత్తులో ఎటువంటి భరోసా ఇవ్వని సిపి ఎస్ .విధానాన్ని వెంటనే రద్దు చేయాలని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్. ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు.. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఆయన కార్యవర్గ సభ్యులు లోకాచారి సురేష్ , రంగనాయక్, మణికంఠ, ధరణి, కోదండ శెట్టి తదితరులతో కలసి మాట్లాడారు.. తమ న్యాయమైన కోర్కె సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని.. పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు.. అంటూ గత ప్రభుత్వం దీనిపై మాకు మొండిచేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.. పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోకి వస్తే.. తమ హామీల‌ను తీరుస్తామని మాట ఇచ్చి.. ఇప్పటివరకు అమలు చేయలేదని చెప్పారు..

నేటికీ త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానం కొనసాగుతున్నదని గుర్తు చేశారు.. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు… కర్ణాటకలో పాత పెన్షన్ అమలుకై కసరత్తు చేస్తున్నారన్నారు …. గతంలో 70 వేల మంది తో తాము నిరసన మార్చ్ ను చేశామన్నారు… ప్రస్తుత ప్రభుత్వం పాలనలోకి వచ్చాక.. ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీ సింహగర్జన తో ఛలో విజయవాడ ఉద్యమంగా లక్షమంది ఉద్యోగులతో భారీ కార్యక్రమాన్ని తలపెట్టామని ఎంప్లాయిస్ అందరూ ఈ సింహాగర్జన కు తరలివచ్చి.. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement