Saturday, November 23, 2024

AP | ఏపీలో మందుబాబులకు కొత్త ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగే సూచనలు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కింగ్ ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి ట్వీట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఆహా.. ఎంత గుడ్ న్యూస్ చెప్పారండీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు లిక్కర్ ప్రియులు. మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చెప్పినట్లే.. నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ జరుగుతోంది.

మరోవైపు మద్యం పాలసీపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం రాగానే వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొస్తారని ప్రచారం తెలుస్తోంది. డిస్టలరీస్ లైసెన్సులను క్యాన్సిల్ చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఉన్న 3,600 లిక్కర్ షాపులను టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని భావిస్తున్నారు.

డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాపుకి రూ.45,000 – అర్బన్ ఏరియాలో రూ.55,000 డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు జరుపుతున్నారట. కల్తీ మద్యం లేకుండా.. తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement