Thursday, November 21, 2024

Ap | రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన వృద్ధి రేటు

అమరావతి, ఆంధ్రప్రభ ఎన్నికల వేళ రాష్ట్రంలో వృద్ధిరేటు గణనీయంగా పెరిగినట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకున్నట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు సిద్ధం చేసింది. 2023 ఆర్థిక సంవత్స రంలో భారీ వర్షాల కారణంగా వ్యవసాయం, ఉపాధి, ఐటి పరిశ్రమలు తదితర అన్ని రంగాల్లోనూ భారీ వృద్ధి నమోదైనట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు సిద్ధం చేసింది.

రానున్న శాసనసభ సమావేశాల్లో ఈ గణాంకాలనే ప్రభుత్వం వినిపించనుందని సమాచారం. 2011 ధరల మేరకు, ప్రస్తుత ధరల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న ఉన్న వృద్ధి వివరాలను ప్రణాళిక శాఖ రూపొందించింది. తాజా ధరల మేరకు 2022-23 ఆర్థిక సంవత్స రంలో జిఎస్‌డిపి రూ.13, 17,728 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. అదే గతేడాది అయితే జిఎస్‌డిపి రూ.11,33,837 కోట్లుగా వుందని, దీంతో తాజాగా 16.22 శాతం వృద్ధిగా నమోదైరదని ప్రణాళిక శాఖ వివరించింది.

జీవీఏ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) కూడా అదే స్థాయిలో నమోదైంది. గత ఏడాది 10,40,187 కోట్లుగా ఉన్న జివిఎ, ఈ ఏడాది 12,14,961 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే 16.80 శాతం వృద్ధి సాధించినట్లు నమోదైంది. రాష్ట్రంలో కీలక రంగమైన వ్యవసాయం విలువ ప్రతియేటా గణనీయంగా పెరిగిపోతున్నట్లు ప్రణాళిక శాఖ అంకెలు చెబుతున్నాయి.

- Advertisement -

2018-19లో వ్యవసాయ ఉత్పత్తి విలువ రూ.2,76,335 కోట్లు-గా వుండగా, అది 2022-23 నాటికి ఏకంగా రూ.4,39,645 కోట్లకు చేరుకుంటున్నట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. ఇది గతేడాది కంటే 13.18 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.పారిశ్రామిక రంగంలోనూ వృద్ధేమరో కీలకమైన పారిశ్రామిక రంగంలో కూడా భారీ వృద్ధినమోదైనట్లు అధికారులు తేల్చారు. 2018-19 కన్నా ఏకంగా లక్ష కోట్ల విలువ పెరిగినట్లు చూపిరంచడం విశేషం. 2018-19లో రూ.1,88,601 కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి అది రూ.2,83,821 కోట్లకు చేరుకున్నట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది.

ఇది గత ఏడాదికన్నా 16.36 శాతంగా ఉన్నట్లు తేల్చారు. జాతీయ స్థాయిలో కేవలం 14.2 శాతం వృద్ధి నమోదైతే రాష్ట్రంలో రెండు శాతం కన్నా ఎక్కువ వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక సేవా రంగానికి సంబంధించి ఐదేళ్లలో రూ.1.60 లక్షల కోట్ల విలువ పెరిగినట్లు తెలిపారు. గత ఏడాది 4,07,810 కోట్లుగా విలువ అంచనా వేయగా, 2022-23లో 4,91,496 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ఏకంగా 20.52 శాతం వృద్ధిగా రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement