Monday, November 18, 2024

AP: ఫిబ్రవరి రెండోవారంలో అనంతపురంలో “సిద్దం” సభ : మంత్రి పెద్దిరెడ్డి 

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : వచ్చే ఎన్నికలకు పార్టీ వర్గాలను సన్నద్ధం చేసే నిమిత్తం నిర్వహించే సిద్ధం సభల పరంపరలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి సంబందించిన సభను  ఫిబ్రవరి రెండో వారంలో అనంతపురంలో నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈరోజు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన తిరుపతిలో సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మంత్రులు ఉష శ్రీచరణ్, ఆర్కే రోజా, రాయలసీమలో 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మేల్యేలు, ఇంచార్జీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలో 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇంచార్జీలతో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తెలుసుకున్నామని చెప్పారు. ముందుగా అనుమతి తీసుకున్న ముగ్గురు తప్ప అనంతపురం, హిందూపురం, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల లోక్ సభ నియోజకవర్గాలను సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు అందరూ పాల్గొన్నారని తెలిపారు.

అనంతపురంలో ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించ తలపెట్టిన సిద్దం సభకు ఐదు లక్షలకు పైగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలను కూడా ఈసారి కైవసం చేసుకునేలా రాయలసీమలో కృషి చేస్తున్నామన్నారు. సత్యవేడు శాసనసభ్యుడు ఆదిమూలం తనపై చేసిన విమర్శల గురించి ప్రశ్నించగా.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని జవాబిచ్చారు. నేనెలాంటి వాడినో ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

- Advertisement -

షర్మిల వేషం కాంగ్రెస్ ది – స్క్రిప్ట్ చంద్రబాబు ది  మంత్రి రోజా  

Advertisement

తాజా వార్తలు

Advertisement