Friday, November 22, 2024

సిద్దేశ్వరం బ్యారేజ్ తోనే సీమకు ప్రయోజనం.. చలో సిదేశ్వరం కార్య‌క్ర‌మంలో బైరెడ్డి

కృష్ణ నదిపై తీగ వంతెన నిర్మాణం వల్ల రాయలసీమకు ప్రయోజనము లేదని బీజేపీ రాయలసీమ అభివృద్హి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ అన్నారు. బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఈ నాటిది కాదన్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్ అని బైరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రాయల సీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో చలో సిద్దేశ్వరం పేరిట కృష్ణ నది వద్ద జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన సీమ వాసులతో కలసి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంగమేశ్వరం నుంచి ర్యాలీగా పాదయాత్ర చేసుకొంటూ సిద్దేశ్వరం చేరుకొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా సదస్సుకు హాజరయిన సీమ వాసులను ఉద్దేశించి బైరెడ్డి మాట్లడుతూ.. జాతీయ రహదారిలో భాగంగా సోమశిల, సిద్దేశ్వరం మధ్య కృష్ణ నదిపై నిర్మించనున్న తీగెల‌ వంతెన నిర్మాణం వల్ల.. పర్యాటకం కాదు. సీమ వాసులు చిరకాల డిమాండ్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.. సీమ జిల్లాల సాగు, తాగు నీటి కోసం వైసీపీ ప్రభుత్వం, నేతలు బ్రిడ్జి కమ్‌ బ్యారేజ్ నిర్మాణానికి చొరవచూపాలన్నారు. లేకుంటే చరిత్ర హీనులు అవుతారని బైరెడ్డి వైసీపీ నేతలను హెచ్చరించారు. కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి తరలవచ్చిన సీమవాసులను సిద్దేశ్వరనికి 4 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో మండుటెండలో పాదయాత్ర చేసుకొంటూ సిద్దేశ్వరం చేరుకొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement