తిరుమల (ప్రభ న్యూస్) : ఇవ్వాల (సోమవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం ఈ మూడు కేంద్రాల్లో స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేల టోకెన్లు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు.
భక్తులు ఆధార్ కార్డుతో ఒకసారి సర్వదర్శనం టోకెన్ తీసుకుంటే నెలరోజులు వరకు మళ్లీ ఉచిత దర్శన టోకెన్ ఇవ్వరని, టోకెన్లు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని టీటీడీ అధికారులు తెలిపారు. ఏ రోజు టోకెన్లు తీసుకున్న వాళ్లకి అదే రోజు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నామని, ఉచిత దర్శనం టోకెన్లు దొరకని భక్తులకు తిరుమల క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వ దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవీ ధర్మారెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: Humanity: హైకోర్టు జడ్జిని కదిలించిన ఘటన.. చంటిబిడ్డకు చనుబాలిచ్చిన కానిస్టేబుల్ ఔదార్యం