Friday, November 22, 2024

ద్రావిడ వర్సిటీకి షోకాజ్ నోటీసులు.. పి హెచ్ డి, డిగ్రీల ప్రదానాల ఉల్లంఘన

కుప్పం, (ప్రభ న్యూస్) : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలో ఉన్న ద్రావిడ విశ్వ విద్యాలయంలో పీజీ, ఎం.పిల్, డిగ్రీ సర్టిఫికెట్ లు ఇవ్వడంపై నియమనిభందనాలు ఉల్లంగించారాని ప్రస్తుత విసి, పూర్వపు విసిలకు రాష్ట్ర గవర్నర్ తరుపున రాష్ట్ర ఉన్నత విద్య శాఖ తరుపున షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ద్రావిడ విశ్వ విద్యాలయంలో ఎం పి ల్, పి హెచ్ డి ప్రదానంపై యు జి సి నియమనిభందనలు పాటించడం లేదని ప్రభుత్వం నియమించిన డా.జస్టిస్, బి.శేషశయన రెడ్డి (రిటైర్డ్ ) విచారణ నివేదిక ఇవ్వడం జరిగింది. కొన్ని అవకతవకలను ప్రభుత్వం గుర్తించారు.ప్రస్తుత ఉప కులపతి, మాజీ వైస్-ఛాన్సలర్లు పై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు.

విద్యార్థుల ప్రవేశాల మొత్తం ఎపిసోడ్, మూల్యాంకనం మరియు పి హెచ్ డి,డిగ్రీలను ప్రదానం చేయడం,యూజిసి నిబంధనలు మరియు గౌరవనీయమైన హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలను షోకాజ్ నోటీసు లో ప్రస్తావించారు. ప్రస్తుత వైస్ ఛాన్సలర్, ఇతరులు ఉల్లంఘించారని,యూనివర్సిటీ ద్వారా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలను నోటీసులో అడిగారు. ఈ నివేదికలో విచారణ అథారిటీ నోటీసులు ఇచ్చిందని నివేదించింది. మాజీ వైస్-ఛాన్సలర్లకు, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement