Saturday, November 23, 2024

ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రజలకు వివరించాలి : కేంద్ర మంత్రి డా.భారతి ప్రవీణ్

కేంద్ర ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ NTR జిల్లాలో పర్యటించారు. ఈరోజు ఉదయం బీజేపీ NTR జిల్లా పదాదికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పధకాన్ని ప్రజలకు చేరనియ్యకుండా, ఆరోగ్యశ్రీ పేరుతో మోసం చేస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఆయుష్మాన్ భారత్ పధకంలో 5 లక్షల జీవిత భీమా పధకం ఉంటే, ఆరోగ్య శ్రీ ద్వారా జీవితభీమా సౌకర్యం లేదన్నారు. ఆరోగ్యశ్రీ లో కేవలం 150000 (ఒక లక్ష యాబై వేలు) వరకే వైద్యం చేయించుకోవడానికి అవకాశముందన్నారు.

తాను ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ జిల్లాకు పర్యటనకు వస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని, ఉన్న సమస్యలు పార్టీ కార్యాలయంలో గ్రీవియన్స్ బాక్స్ ఏర్పాటు చేసి తన దృస్టికి తేవాలని జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ కు ఆదేశించారు.. నరేంద్ర మోడీ దేశంలో ఉన్న మొత్తం ప్రజలకు రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దేశం నుండి కరోనాను తరిమేశారన్నారు. ఈసందర్భంగా NTR జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ధరణికోట వెంకట రమణ జగ్గయ్యపేట లో పొల్యూషన్ గురించి కేంద్ర మంత్రికి వివరించి వినతి పత్రం అందజేశారు. దానిపై స్పందించిన మంత్రి తప్పకుండా జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకుంటామని, మంత్రి స్వయంగా జగ్గయ్యపేటకు వచ్చి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సబాధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ వ్యవహరించగా, పాకా సత్యనారాయణ, పాతూరి నాగభూషణం, వామరాజు సత్య మూర్తి, మాగంటి సుధాకర్ యాదవ్, అడ్డూరి శ్రీరామ్, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement