Wednesday, November 20, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌కు అడ్డ‌దారులు, తిరుపతి లో 7 వేల దొంగ ఓట్లు: నిమ్మల రామానాయుడు

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సిపి తిరుపతి నియోజకవర్గంలో 7 వేలదొంగ ఓట్లను నమోదు చేసిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు.. పెద్దల సభను అగౌరవ పరిచే విధంగా ఫేక్ డాక్యుమెంట్లతో ఓటు హక్కును పొందాలని, డిగ్రీ సర్టిఫికెట్ను కలర్ జిరాక్స్ చేసి ఫోటోషాప్ లో పేర్లు మార్చి ఫేక్ఓట్లు సిద్ధం చేసుకున్నారన్నారు.

ఏడో తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా ఓటర్లుగా నమోదు చేశారని, అదేవిధంగా ఇల్లులు లేవు ఖాళీ స్థలాల్లో ఓట్లు ఉన్నట్లు రికార్డులో నమో చేశారన్నారు. శాసనమండలిలో ప్రజల తరఫున గళం వినిపించేందుకు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని విన్నవించారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి సుగుణమ్మ. రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ. బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఊకా. విజయ్ కుమార్. టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి.రాష్ట్ర కార్యదర్శిలు సురా సుధాకర్ రెడ్డి. బుల్లెట్ రమణ. కార్పొరేటర్.ఆర్ సి మునికృష్ణ. తెలుగుదేశం పార్టీ నాయకులు సంజయ్. నగర కార్యదర్శి మహేష్ యాదవ్. తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement