అమరావతి, ఆంధ్రప్రభ ; న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో షార్టు ఫిలిమ్ కాంపిటీషన్-2022 పోటీలను నిర్వహించడం జరుగుతోందని కర్నూల్లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి సోమవారం తెలియజేశారు. ఆసక్తిగల వారు ఈషార్టు ఫిలిమ్ పోటీల్లో పాల్గొన వచ్చని ఈపోటీల్లో పాల్గొనే వారు వారి ఎంట్రీలను ఆన్లైన్ ద్వారా నేరుగా nhrcshortfilm. gmail.com కు గూగుల్ డ్రైవ్ ఫోల్డర్ లో పంపాల్సి ఉంటుదని తెలిపారు.
ఈషార్టు ఫిలిమ్ పోటీలకు సంబంధించిన ఎంట్రీలను కర్నూల్ ఎపి హెఆర్సీ కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల కమీషన్ న్యూఢిల్లీ వారిచే నిర్వహించే ఈషార్టు ఫిలిమ్ పోటీ-లు-2022కు సంబంధించిన ఎంట్రీలను వచ్చే సెప్టెంబరు 15వ తేదీ 2022లోగా పైతెలిపిన మెయిల్ అడ్రస్ కు ఆ్లనన్ ద్వారా పంపాల్సి ఉంటు-ందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.