సంక్రాంతి పండగలో రవాణా ఛార్జీల పేరుతో అధిక డబ్బులు వసూలు, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లాలోని అగనంపూడి టోల్ గేటు వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలు పాటించని 20 బస్సులకు జరిమానా విధించారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. డిమాండ్‌ను బట్టి ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ప్రయాణికుల వద్ద రెండు, మూడురెట్లు ఛార్జీలు వసూలు చేస్తూ వారిని నిలువు దోపిడీ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది దీనికి అడ్డుకట్ట వేయాలన్న రవాణాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులపై నిఘా పెట్టారు.