గన్నవరం – కృష్ణా జిల్లాలో వైసిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. ఆ పార్టీ కీలకనేత, 2019 గన్నవరంలో వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన యార్లగడ్డ వెంకటరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.. నేడు జరిగిన గన్నవరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.. అలాగే టిడిపి చేరునున్నట్లు చెప్పారు.. దీనికోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ కోరారు.. కాగా, గన్నవరం నుంచి పోటీ చేస్తానని,అయితే టిడిపి సీటు ఇస్తుందో లేదో తెలీయదని అన్నారు యార్లగడ్డ.. ఇది ఇలా ఉంటే కృష్ణా జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశ సమయంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం ..
కాగా, టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతుగా నిలవడంతో నాడు మొదలైన ఈ వివాదం ఇప్పటికీ ఇద్దరి మధ్య ఇప్పటికీ నడుస్తూనే ఉంది. రెండ్రోజులకోసారి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వంశీ వర్గీయుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఇద్దర్నీ కలిపినప్పటికీ ఫలితం లేకపోయింది.. టికెట్ విషయంలో జగన్ తేల్చకపోవడంతో యార్లగడ్డ వైసిపికి గుడ్ బై చెప్పేశారు.. .