Saturday, November 23, 2024

హైకోర్టులో శ్రీల‌క్ష్మికి షాక్ – పిటిష‌న్ కొట్టివేత‌

హైకోర్టులో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మికి ఊహించ‌ని ప‌రిణామం ఎదుర‌యింది. కోర్టు ధిక్కార‌ణ కేసులో శిక్ష‌కు గురైన శ్రీలక్ష్మి అక్క‌డిక‌క్క‌డే క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో ఆ శిక్ష‌ను సేవ‌గా మారుస్తూ ఇటీవ‌ల ఏపీ హైకోర్టు తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో ఏడాది పాటు నెల‌కో రోజు ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల్లో సేవ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సేవ విష‌యంలో పునఃస‌మీక్ష చేయాలంటూ శ్రీల‌క్ష్మి తాజాగా హైకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను తొలుత విచార‌ణ‌కే స్వీక‌రించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాక‌రించ‌గా.. తాజాగా శ్రీలక్ష్మి త‌ర‌ఫు న్యాయివాది వివ‌ర‌ణ‌తో పిటిష‌న్‌ను విచార‌ణ‌కు అనుమ‌తించారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు శ్రీలక్ష్మి పిటిష‌న్‌ను కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement