Tuesday, November 26, 2024

Shock To Jagan – వైసిపికి ఎంపి బాల శౌరి గుడ్ బై…..

వైకాపాకు షాక్- పొమ్మనకుండానే పొగ- వైకాపాకు ఎంపీ బాలశౌరి రాజీనామా- ఎంపీ అభ్యర్థిగా బాలశౌరినీ పక్కనపెట్టి జగన్- మనస్థాపానికి గురైన బాలశౌరి- గత కొద్ది కాలంగా నియోజకవర్గానికి, పార్టీకి దూరంగా బాలశౌరి- నేడో.. రేపో పవన్ కళ్యాణ్ కలవనున్న బాలశౌరి- ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పేర్ని నాని?- ఆసక్తికరంగా మారిన జిల్లా రాజకీయాలు

( ప్రభ న్యూస్ బ్యూరో – కృష్ణా)సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వైకాపాలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. అభ్యర్థుల మార్పులు చేర్పులు సందర్భంగా వైకాపా సిట్టింగ్ లకు షాక్ ఇస్తుండడంతో కృష్ణాజిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయిమచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేనిబాలశౌరి వైకాపాకు రాజీనామా చేశారు.రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైకాపా అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు

.ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే కే పి సారథి వైకాపాకు రాజీనామా చేయగా, తాజాగా అదే బాటలో బాలశౌరి చేయడం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు లేదని బాలశౌరి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. సీఎంఓ నుంచిపిలుపు వచ్చిన బాలశౌరి వెళ్లలేదని చెప్తున్నారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మనస్తాపం తో వైసీపీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య( నాని), ఎంపీ బాలశౌరి ల మధ్య విభేదాలు ఉన్నాయి. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం లో తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇరువురి మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యం పోరు సాగుతోంది. ఇదే నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టాలని జిల్లాలోని మెజార్టీ శాసనసభ్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో అభ్యర్థిని కోసం పార్టీ అధిష్టానం అన్వేషణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఎంపీ బాలశౌరి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నితంగా ఉన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ముఖ్య భూమిక పోషించారు. వైఎస్ హయాంలో తెనాలి ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా తనయుడు సీఎం వైఎస్ జగన్ రెడ్డికి బాలశౌరి అత్యంత ఆప్తుడు గా కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది.

అందులో భాగంగా ఇటీవల మాజీ మంత్రి, పెనమలూరు శాసనసభ్యులు కెపి సారధిని మచిలీపట్నం పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. అదే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా సారధితో చర్చలు జరిపారు. వైకాపా నుంచి పోటీ చేయడానికి నిరాకరించిన సారధి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ బాలశౌరి వైకాపా కార్యకలాపాలకు, మచిలీపట్నానికి కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. బాలశౌరి జనసేన పార్టీలో చేరేందుకు సనాలు చేసుకుంటున్నారని సమాచారం. చిరంజీవి కుటుంబంతో బాలశౌరి కి ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని జనసేన వైపు అడుగులు వేస్తున్నారు నేడో రేపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలో కలవనున్నారు.

- Advertisement -

. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటరీ నుంచి గాని, గుంటూరు పార్లమెంట్ నుంచి గాని పోటీ చేసేందుకు బాలశౌరి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ తో చర్చల సందర్భంగా ఏదో ఒక ఎంపీ సీటు విషయంలో స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత జనసేన పార్టీలో చేరనున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు

.ఎంపీ అభ్యర్థి అన్వేషణలో వైకాపా

మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని అత్యధిక మంది శాసనసభ్యులు బాలశౌరి అభ్యర్థత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు .దీంతో ఎంపీగా జిల్లా మంత్రి జోగి రమేష్ ను పోటీ చేయించాలని భావించిన ఆయన అంగీకరించలేదు. పెనమలూరు ఎమ్మెల్యే కే పి సారధిని ఎంపీ బరిలో దించాలని అధిష్టాన పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య( నాని) పేరు తెరపైకి వచ్చింది. మచిలీపట్నం సమన్వయకర్తగా ఇప్పటికే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి( కిట్టు) ను నియమించారు. ఎంపీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా, జిల్లాలో అన్ని వర్గాల్లో ఇమేజ్ ఉన్న నేతగా పేర్ని నానికి పేరు ఉంది. జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, బలమైన అనుచరులకు ఉన్న పేర్ని నాని రంగంలో దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంపీగా పోటీ చేసేందుకు పేర్ని నాని నిరాకరిస్తే మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణను పార్టీలకు చేర్చుకునే ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement