శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ ఊరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాపూరు మండలంలోని కొండకింద గ్రామం అయిన పంగిలి బీసీ కాలనీలో ఏ ఇంట్లో చూసిన కరెంట్ షాకులు కామన్ అయ్యాయి. ఇట్లా ఒక్కొక్కరు తమకు మాత్రమే జరుగుతుందేమో అనుకుని గమ్మునుండిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో షాక్ కొట్టడం ఎక్కవ కావడం, ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో ఊరంతా ఈ విషయమే చర్చ జరుగుతోంది. దీంతో మండల వ్యాప్తంగా పంగిలి బీసీ కాలనీ ఇష్యూ చర్చకు వస్తోంది.
ఇవ్వాల ఉపేంద్ర అనే యువకుడు కరెంట్ ప్లగ్ పెడుతుంటే షాక్ కొట్టింది. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. కానీ, విద్యుత్ శాఖ సిబ్బంది మాత్రం తమకు దీంట్లీ ప్రమేయం లేదని, ఎర్త్ సమస్య వల్లే అట్లా జరుగుతోందని సమస్యనుంచి తప్పుకుంటున్నారు. దీంతో ఊరు ఊరంతా విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులపై కోసంతో ఉన్నారు. వాళ్లు కనిపిస్తే చాలు కొట్టాలనంత ఆవేశం గ్రామస్తుల్లో నెలకొంది.