Thursday, November 21, 2024

వణికిస్తున్న చలిగాలులు.. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌కు ఉష్టోగ్రతలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రాన్ని చలి గాలులు వణికిస్తున్నాయి. గత రెండు రోజుల నుండి చలి ప్రజలను చంపేస్తోంది. పెద్దలు, పిల్లలు ఉదయాన్నే బయటకు రావాలంటనే కాస్త భయపడుతున్నారు. ఉదయం పదింట వరకు చుట్టేస్తున్న చలి మధ్యాహ్నం మూడు గంటల నుండి మళ్లిd మొదలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఉష్టోగ్రతల కంటే ఐదు డిగ్రీలు తక్కువగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బిగిసుకుపోయి రోడ్లపై తిరగాల్సి వస్తోంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సింగిల్‌ డిజి ట్‌ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి జిల్లాలోని చింతపల్లిలో 9.1 డిగ్రీల ఉషోగ్రత నమోదయ్యింది. అరుకులోయ, మునుములూరులో 11 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యింది.

ఒక్కసారిగా చలి పెరుగుదలకు కారణం
ప్రస్తుతం చలికాలమే నడస్తున్నప్పటికీ ఒక్కసారిగా చలిపెరగడానికి కారణం మాత్రం ఉత్తర, ఈశాన్య భారత్‌ నుంచి తక్కువ ఎత్తులో గాలలు వీచడమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికితోడు బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం కూడా చలికి ఒక కారణమని తెలుస్తోంది. కాగా తెలంగాణా ప్రాంతంలో చలి మరీ విపరీతంగా ఉంది. జాతీయ రహదారులన్నీ పొగమంచుతో కప్పేయబడ్డాయి. దీంతో వాహనదారుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌ వాసులను చలి చ ం పేస్తోంది. గత రెండు రోజుల నుండి పెరిగిన చలితో రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు బయటకు రావాలంటనే భయపడిపోతున్నారు. ఇక తెలంగాణాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొమరం బీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్టోగ్రత, ఆదిలాబాద్‌లో 8.3 డిగ్రీల ఉష్టోగ్రత, సిర్పూర్‌లో 7.3 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉంది.

- Advertisement -

చలిగాలలతో ఆరోగ్యంపై ప్రభావం
పెరిగిన చలి గాలుల దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమంటున్నారు. శ్వాసకోస సంబంధ వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేప్పుడు నెత్తికి మంకీ క్యాప్‌, ఒంటికి స్వెటర్‌ ఉంటేనే వెళ్లాలంటున్నారు. చలి గాలులు ఎక్కువగా వీచే సమయంలో ఎముకలు, జాయింట్లు, కండరాల నొప్పులు వచ్చే అవకాశముంది. అలాగే దగ్గు, జలుబు రావొచ్చు. చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చు. బిపి ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement