Friday, November 22, 2024

శివ.. శివా… పూజల పేరుతో ముక్కంటి భక్తులకు మోసం..

శ్రీకాళహస్తి, ప్రభ న్యూస్ : పట్టణంలోని తేరి వీధి ప్రాంతానికి చెందిన గోవింద శర్మ అనే వ్యక్తి, తాను ఆలయంలో పరిచారుగా పని చేస్తున్నాను అని, మీరు రాకపోయినా పర్లేదు నగదు నాకు ఫోన్ పే ద్వారా గాని గూగుల్ పే ద్వారా గాని పంపిస్తే మీ పేరు నామ గోత్రాలతో స్వామి అమ్మవార్లలకు అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు పంపించడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మరో ఐదు మందికి నా నెంబర్ ఇవ్వండి అంటూ తూర్పుగోదావరి జిల్లా పెరుమండ్ల ఆంధ్ర బ్యాంక్ మేనేజర్కు తెలిపారు.

అయితే అతను క్రిస్టియన్ కావడంతో పక్కనే ఉన్న మల్లేశ్వర రావుకు తెలిపారు దీంతో కుటుంబ సభ్యులందరూ పేరుమీద అభిషేకము నిర్వహించడం జరుగుతుందని వెంటనే 7500 రూపాయలు తనకు పంపించవలసిందిగా స్వామివారు నమ్మించారు. మరుసటి రోజు ఇంకా డబ్బులు రాలేదు పంపించండి అని ఫోన్ చేసాడు, అంత లేదు స్వామి అని మల్లేశ్వరరావు చెప్పడంతో అడ్వాన్స్గా పంపించండి తర్వాత ఇవ్వండి అంటూ తెలిపారు. అతను వెంటనే స్వామి ఫోన్ పే నెంబర్కు 1000 ఒక్క రూపాయి పంపించడం జరిగిందని వెంటనే మరుసటిరోజు మిగతా డబ్బులు కోసం ఎక్కువ సార్లు ఫోన్ చేయడంతో, స్వామి పూజ జరిగిందా ప్రసాదాలు పంపిస్తాము అని అన్నారు పంపించారా అని అడగడంతో పూజలు చేయడం జరిగిందని డబ్బులు పంపిస్తే స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు పంపించడం జరుగుతుందని తెలిపారు..

దీనిపై గోవింద శర్మ స్వామి వివరణ కోరగా…

తాను రాఘవేంద్ర స్వామి మఠంలో పూజారిని అయితే తూర్పుగోదావరి జిల్లా పెరుమండ్ల గ్రామానికి చెందిన మల్లేశ్వరరావుకు పూజలు చేయలేదని అతను పంపించిన డబ్బులు కూడా వెనక్కు పంపించడం జరిగిందని అతను చెప్పినవన్నీ అవాస్తవాలని తెలిపారు.

- Advertisement -

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement