Thursday, December 12, 2024

AP | షార్‌ మొదటి డైరెక్టర్‌ జనార్ధన్‌రావు మృతి..

సూళ్లూరుపేట, ఆంధ్రప్రభ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) మొదటి ప్రాజెక్టు డైరెక్టర్‌ వై జనార్ధనరావు (వైజె రావు) మృతి చెందారు. కొన్నేళ్లుగా అమెరికాలో కుమార్తె వద్ద ఉంటున్న ఆయన 94 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, కోలవెన్ను గ్రామానికి చెందిన వైజే రావు శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి అనువుగా శ్రీహరికోట దీవిని తీర్చిదిద్దే బాధ్యతలను విక్రమ్‌ సారాభాయ్‌ రావుకు అప్పగించారు.

1972 నుంచి 1977 వరకు సంస్థ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అంతకు ముందు ఆయన తిరువనంతపురంలోని స్పేస్‌ సెంటర్లో కూడా పనిచేశారు. వై జనార్దన్‌ రావు మృతితో ఇస్రో వర్గాలు దిగ్భాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement