Tuesday, November 19, 2024

AP: ప్ర‌శ్నించే గొంతును నొక్కేస్తున్నారు – షర్మిల

చెల్లెళ్లంటేనే భ‌య‌ప‌డిపోతున్న జ‌గ‌న్
భావ ప్ర‌క‌ట‌న‌ను అడ్డుకుంటున్న వైసీపీ ప్ర‌భుత్వం
రాష్ట్ర అభివృద్దిపై చ‌ర్చ‌కు సిద్ద‌మా
వివేకా హ‌త్య కేసులో న్యాయం కోసం పోరాటం
అయినా ఫలితం ఉండ‌టం లేదు
క‌డ‌ప‌లో నామినేష‌న్ వేసిన అనంత‌రం
జ‌గ‌న్ స‌ర్కార్ పై విరుచుకుప‌డ్డ ష‌ర్మిల

అధికార వైసీపీ భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. న్యాయం కోసం గొంతు ఎత్తితే అడ్డుకున్నారని విమర్శించారు. జగన్‌కు చిన్నరాయి తగిలితే.. హత్యాయత్నమని బ్యానర్ వార్త వేశారని, మరి వివేకానందను ఏడుసార్లు గొడ్డలితో నరికి చంపితే జ‌గ‌న్ పత్రికకు హార్ట్‌ఎటాక్ అని ఎలా అనిపించిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కడప కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా షర్మిల శనివారం ఉదయం కలెక్టరేట్‌లోని ఆర్వోకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద కూతురు సునీత, తులసీరెడ్డి ఉన్నారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌ మాట్లాడుతూ.. జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అయిదేండ్లుగా పోరాటం..

ప్రజా నాయకులకు వ్యక్తిగత జీవితం ఉండకూడదా? అని ష‌ర్మిల ప్రశ్నించారు. జగన్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ఉందా అన్నారు. తండ్రిని పోగొట్టుకున్న సునీత న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. కడప, పులివెందుల ప్రజలు మంచి తీర్పు ఇస్తారని నమ్మకం త‌న‌కు ఉందన్నారు. న్యాయం కోసం వైఎస్సార్‌ బిడ్డ ఒకవైపు.. నిందుతులు మరోవైపు ఉన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చెల్లెల్లు అంటేనే వైసీపీ స‌ర్కారుకు భ‌యం

- Advertisement -

చెల్లెలంటేనే వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే తమను అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని ష‌ర్మిల ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్సార్‌, మాజీ మంత్రి వివేకాను కడప ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఈ విషయంలో తనకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. అంతకుముందు నామినేషన్ పత్రాలను వైఎస్సార్ ఘాటుకు వెళ్లి సమాధి వద్ద పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement