Friday, November 22, 2024

ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఈ 15వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. దీనికోసం ఇంద్ర‌కీలాద్రిని అధికారులు ముస్తాబు చేశారు. మొదటి రోజు  సన్నపనది కార్యక్రమాల అనంతరం  ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉంటుంది. వివిధ అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఈ నెల 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా, అదే రోజు సాయంత్రం మహాలక్ష్మిదేవిగా దర్శనమిస్తారు. ఈ నెల 12న సరస్వతీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. సరస్వతి దేవి అలంకరణ రోజున సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక, 13వ తేదీన దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా, 15న రాజారాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

ఇంద్ర‌కీలాద్రికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు.  భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాలు చేశారు.  కృష్ణాన‌దిలో స్నానాలు చేసే వారికోసం ప్ర‌త్యేకంగా ఘాట్‌ల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తిరోజూ 10 వేల మంది వ‌ర‌కు అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  అమరావతికి వెయ్యి కోట్లు వస్తాయా?

Advertisement

తాజా వార్తలు

Advertisement