Friday, November 22, 2024

మరో ప్రయోగానికి సిద్దమైన షార్‌.. 7న అంతరిక్షంలోకి ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ1 …

సూళ్లూరుపేట (శ్రీహరికోట), ప్రభన్యూస్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో నూతన ప్రయోగానికి సన్నద్దమైంది. ఈ నెల 7వ తేదీన చిన్న ఉపగ్రహ వాహనక నౌకను ప్రయోగించేందుకు సతీష్‌థావన్‌ స్పెష్‌ సెంటర్‌ (షార్‌) శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. ఇస్రోకు చెందిన దేశంలోని వివిధ కేంద్రాల నుంచి తీసుకువచ్చిన విడిభాగాలను షార్‌లోని అనుసంధాన కేంద్రంలో మూడు దశలుగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ -డీ1 రాకెట్‌ను సిద్దం చేశారు. ఈ రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌ -02, ఆజాది శాట్‌ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహక నౌక మూడు దశలలోను ఘన ఇంధనం ఉంటుంది. మూడు సాలిడ్‌ మోటార్లు కలిగి ఉంటాయి. ఈ నెల 6వ తేదీన రాకెట్‌ సన్నదత సమావేశం (ఎంఆర్‌ఆర్‌) జరుగనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపారు.

ఇందుకు సంబంధించి ముందుగా రాకెట్‌కు తుది పరీక్షలు నిర్వహించి నివేదికలను ఎంఆర్‌ఆర్‌ సమావేశంలో శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. అనంతరం ల్యాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు రాకెట్‌ ప్రయోగానికి సంసిద్దత వ్యక్తం చేస్తే కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే షార్‌ వాణిజ్య పరంగా దూసుకుపోతున్నట్లు ఇస్రో వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement