Monday, September 23, 2024

AP | తిరుమలలో రేపు శాంతిహోమం, పంచద్రవ్య సంప్రోక్షణ !

తిరుమలలో రేపు ఉదయం శాంతిహోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా ఆయన ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. టెంపుల్ పవిత్రతను కాపాడటం మా బాధ్యత అన్నారు. 3 రోజుల పాటు పవిత్ర యాగం చేస్తాం.

రేపు ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు శాంతిహోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తాం. విమాన ప్రకారం దగ్గర యాగశాలలో శాంతి యాగం నిర్వహించనున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. యాగం కోసం మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. యాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొంటారు.

వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్స్ చేస్తారని అన్నారు. ఆగమ శాస్త్రం తెలిసిన వారితో కమిటీ వేస్తామని తెలిపారు. ఐజీ స్థాయి అధికారితో సిట్ వేస్తాం అని తెలిపారు. అన్ని దేవాలయాల్లో ఎప్పటికప్పుడు యాగాలు చేస్తారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు రిపోర్టులో తేలింది. సిట్ నివేదిక ఆధారంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు.

వైసీపీ హయాంలో కొండపై అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిని గుర్తింపు పొందిన తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వం అపవిత్రం చేసింది. కానీ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కొండపై అపచారం చేసి సమర్థించుకుంటున్నారు. కరుడుగట్టిన నేరస్థుడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు.

ఇలాంటి పనులు చేసేందుకు మీకు ఎన్ని గట్స్ ఉండాలి. వేంకటేశ్వర స్వామి వారి అపచారం చేసి ఎదురుదాడి చేస్తారా..? వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అపచారం చేసి పచ్చాతాపం పడని మిమ్మల్ని ఏమనాలి..? తప్పు చేసి కూడా మళ్లీ లేఖలు రాస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరాలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement