Friday, November 22, 2024

ఏపీకి రాజ‌ధాని లేక‌పోవ‌డం సిగ్గుచేటు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో రాజ‌ధాని లేక‌పోవ‌డం సిగ్గుచేట‌న్నారు బి అర్ ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..బీజేపీని ఓడించడం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ ముందుందని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని, ఆంధ్రప్రదేశ్‌ అన్నింటిలో వెనుకంజలో ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కంపెనీని కూడా తీసురాకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చారని చెప్పారు. రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు అందిస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు గత ఐదేండ్లలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ తెలంగాణకు రోజుకొక్క కంపెనీ తీసుకొస్తున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఐదేండ్ల అయిందని.. అయినా అది ఇప్పటివరకు పూర్తికాలేదని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌కి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీని స్పెషల్‌ స్టేటస్‌ గురించే అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. దేశంలో మోదీని ప్రశ్నిస్తున్న ఒకేఒక్క వ్యక్తి సీఎం కేసీఆర్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement