జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని, సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారుంటారని, దీనిపై వివాదం సృష్టించడం సిగ్గు చేటని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులో చారిత్రాత్మకమయిన జిన్నాటవర్ ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…. వీరుల త్యాగంతోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నామన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరమన్నారు. జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బీజేపీ కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందన్నారు. ఇది సరైంది కాదని హోంమంత్రి సుచరిత అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..