Friday, November 22, 2024

AP | టీడీపీలో చేర‌నున్న మాజీ మంత్రి శైలజానాథ్‌.. ముహుర్తం ఖరారు?

అమరావతి, ఆంధ్రప్రభ:పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శైలజానాథ్‌ దాదాపు టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా శైలజానాథ్‌ టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం కూడా ఆనియోజకవర్గంలో బలమైన అభ్యర్ధికోసం అన్వేషణ సాగిస్తున్న తరుణంలో ఇప్పుడు జేసీ దివాకర్‌ రెడ్డి ఆయనతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీలో చేరాలని శైలజానాథ్‌కు జేసీ ఆహ్వానం పలికినట్లుగా విశ్వసనీయ సమాచారం. బుధవారం టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు జేసీ దివాకర్‌ రెడ్డి శింగనమల వెళ్లి శైలజానాథ్‌తో భేటీ అయినట్లుగా సమాచారం.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని జేసీ ఆయన్ను ఆహ్వానించినట్లుగా పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. అయితే, ఈ భేటీపై జేసీ దివాకర్‌ రెడ్డిగానీ, శైలజానాథ్‌ కానీ ఎవరూ స్పందించలేదు. శింగనమల నంచి గతంలో రెండు సార్లు గెలిచిన శైలజానాథ్‌ మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం శింగనమలలో టీ-డీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ఇంకా ఇంచార్జిని కూడా నియమించలేదు. బలమైన అభ్యర్థి ఉండాలని.. తాము సూచించిన వారికే టిక్కెట్‌ ఇవ్వాలని జేసీ బ్రదర్స్‌ పట్టు-బడుతున్నారు. దీంతో టీ-డీపీ హైకమాండ్‌ అక్కడ అభ్యర్థిత్వం ఎవరికి అన్నది ఖరారు చేయలేదు. ఈ క్రమంలో జేసీ .. శైలజానాథ్‌తో చర్చలు జరపడం హాట్‌ టాపిక్‌గా మారింది.

శైలజానాథ్‌ టీ-డీపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం
కొంత కాలంగా శైలజానాథ్‌ టీ-డీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్‌గా పదవీ కాలం పూర్తయిన తర్వాత శైలజానాథ్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. వచ్చే ఎన్నికల్లో తాను శింగనమల నుంచే పోటీ- చేయాలనుకుంటు-న్నానని శైలజానాధ్‌ ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం త్వరలో చెబుతానంటూ వెల్లడించారు. ఇప్పటికే శైలజానాద్‌ టీ-డీపీ ముఖ్య నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లినట్లు- సమాచారం. శైలజానాద్‌ 2004, 2009 ఎన్నికల్లో అప్పటి టీ-డీపీ సీనియర్‌ నేత శమంతమణిపై విజయం సాధించారు. 2014లో టీ-డీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శమంతకమణికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో శంమతకమణి కుమార్తె యామినీ బాల టీ-డీపీ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై విజయం సాధించారు.

- Advertisement -

శింగనమల నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం టీ-డీపీ అన్వేషణ
2019 ఎన్నికల్లో ప్రస్తుత టీ-డీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ బండారు శ్రావణిపైజొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బండారు శ్రావణి టీ-డీపీ నుంచి తిరిగి సీటు- ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో కొంత కాలంగా టీ-డీపీలో విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు శైలజానాద్‌కు సీటు-పైన హామీ దక్కుతుందా లేదా అనేది కీలకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు- ఇస్తామని టీ-డీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసింది. అందుకే బలమైన నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అనంతపురం పార్లమెంట్‌ నుంచి జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు పోటీ- చేసే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థులు అసెంబ్లీ పరిధిలో ఉండాలని ఆయన కోరుతున్నారు. శైలజానాథ్‌ బలమైన అభ్యర్థి అవుతారని ఆయన భావిస్తున్నారు. ఈతరుణంలోనే ఈ భేటీ జరిగినట్లు స్పష్టమౌతుంది. అంతే కాకుండా రాయలసీమలో పార్టీ చేరికలు, బలోపేతం తదితర అంశాలను జీసీ బ్రదర్స్‌తోపాటు కోట్ల కుటుంబానికి టీడీపీ అధిష్టానం అప్పగించింది. దీంతో జేసీ చేరికలపై దృష్టిసారించారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు
అనంతపురం జిల్లా ప్రజలు మద్దతిస్తే మొత్తం ఏకపక్షంగా ఒకే పార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లు- మాత్రమే దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో టీ-డీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు సంతృప్తిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement