నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో నర్సరీ చదువుతున్న బాలికపై ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం… ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న బాలికపై ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి.
బాలిక కడుపునొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు.