విజయనగరం జిల్లాలో తీవ్రస్థాయిలో కరువు తాండవిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ… వేసిన పంటలు పండక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కి రైతుల కష్టనష్టాలు అవసరం లేదన్నారు. రైతుల బాధలు పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారన్నారు. రాష్ట్రంలో 685 మండలాలు ఉంటే 103 కరువు మండలాలు ప్రకటించారన్నారు. జిల్లాలో 27 మండలాలు ఉంటే ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదన్నారు. 37 వేల ఎకరాలు వరి ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. మిగతా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. పంట నష్టాలపై దృష్టి పెట్టి వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. వ్యవసాయం కు తొమ్మిది గంటలు విద్యుత్ ఇవ్వాలన్నారు. పశుగ్రాసం, త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర మాజీ మంత్రి, సి.డబ్ల్యు.సి సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ… అన్నం పెట్టే రైతన్న నేడు ఇబ్బందుల్లో పడ్డాడన్నారు. సగటున రోజుకి ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అప్పులు చేసి పంటలు పండక తీవ్ర మానసిక ఆందోళనలో పడిపోయారన్నారు. దేశంలో, రాష్ట్రంలో గడిచిన పదేళ్ళ లో ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు. కనీస నష్టపరిహారం కానీ, ఇన్సూరెన్స్ కూడా రావడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు మాత్రం రైతులు మోటార్స్ కి మీటర్లు పెట్టే కార్యక్రమం దేశంలో, రాష్ట్రంలో జోరుగా సాగుతోందన్నారు. రైతులు పొలాలకు మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏముందని అన్నారు. విద్యుత్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందన్నారు. తమకు రాష్ట్రంలో బలం లేకున్నా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతున్నామన్నారు. అనేక నిరసనలు చేసి కలెక్టర్ల ద్వారా సీఎం కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. దేశంలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనేనని, రాహుల్ ప్రధాని అయిన వెంటనే రైతులను ఆదుకుంటామని తెలిపారు.