Saturday, November 23, 2024

Cyclone Asani: దూసుకొస్తున్న అసానీ తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ‘అసానీ’ ఈ రోజు తెల్లవారుఝాముకి కాకినాడకు ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు అర్థరాత్రి వరకూ ఇది వాయవ్యంగా పయనించి ఉత్తరాంధ్రకు చేరువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అనంతరం ఇది తీరం దాటకుండా మలుపు తీసుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించి వాయవ్య బంగాళాఖాతంలోకి వెళ్లి క్రమంగా బలహీన పడుతుంది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఉరుములు, గాలి తీవ్రతతో కూడిన వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో ఉరుములతో వర్షాలు‌పడతాయి. రేపు కోస్తాంధ్ర యానాంలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. తెలంగాణ రాయలసీమల్లో రేపు ఉరుములతో కూడిన జల్లులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement