అసని తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 50 కి.మీ., కాకినాడకు 150 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. నరసాపురం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.