Saturday, November 23, 2024

ప్ర‌శ్నా ప‌త్రాలు లీక్ చేస్తే ఏడేళ్లు క‌ట‌క‌టాల్లోనే….

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షల విషయంలో పేపర్‌ లీకేజ్‌కు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కొన్ని జాగ్రత్తలను పరీక్ష నిర్వాహకులకు తెలియజేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు దేవానందరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో వరుస పేపర్ల లీకేజీల ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో ఎదైనా అక్రమాలు, అవకతవకలు జరిగినచో చీఫ్‌ సూపరిం-టె-ండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, సి-సెంటర్‌ కస్టోడియస్‌ లు బాధ్యత వహించవలసి ఉంటు-ందని దేవానందరెడ్డి పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలన్ని నో మొబైల్‌ జోన్‌లుగా ప్రకటించామని, కావున పరీక్ష విధులలో పాల్గొనే సిబ్బంది అంతా తమ మొబైల్‌ ఫోన్‌ ఇంటిలోనే ఉంచి రావాలి లేదా సెంటర్‌ లో పోలీస్‌ పికెటింగ్‌ వద్ద మొబల్‌ అప్పగించాలని పేర్కొన్నారు. ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది, పరీక్ష ముగిసేవరకు ఎటు-వంటి పరిస్థితులలో బయటికి రాకూడ దన్నారు. అ-టె-ండర్లు, ఇతర సహాయకులు కూడా టీ-, ఇతర శీతల పానీయాల వంటి అవసరాలకు కూడా పరీక్షా సమయంలో బయటకు రాకూడదన్నారు.

పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల పరిసరాలలో ఉండకూడదన్నారు. పరీక్షా కేంద్రాలుగా ఉన్న కె.జి.బి.వి, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చెందిన పరీక్ష విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో పాఠశాలలో ఉండకూడదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో ప్రైవేట్‌ వ్యక్తులు ఎవరు ఉండకూడదని,పరీక్ష ప్రశ్నా పత్రాలు, వాటిపై వదంతులు వాట్సాప్‌ గ్రూప్‌ లలోకాని, సామాజిక మాధ్యమాలలో కానిప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. చీఫ్‌ సూపరిం-టె-ండెంట్లు- పరీక్షకు హాజరు కాని అభ్యర్ధుల ప్రశ్నాపత్రాలను, మిగిలిన ప్రశ్నాపత్రాలన ుఉదయం 10.00 గంటల లోపల ప్రశ్నాపత్రాల అకౌంట్‌ రాసి జాగ్రత్తగా సీల్‌ చేసి ఉంచాలని పేర్కొన్నారు. పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పరీక్షల చట్టం 25/7 ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్షమరియు లక్ష రూపాయల వరకు జరిమానా పడుతుందని దేవానందరెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement