న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఏడుగురు జ్యుడీషియల్ అధికారులకు జడ్జిలుగా పదోన్నతి లభించింది. బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఆమోదం తెలిపింది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. జడ్జిలుగా పదోన్నతి పొందినవారి జాబితా..
- అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబు
- వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్
- శ్యాంసుందర్ బండారు
- శ్రీనివాస్ వూటుకూరు
- బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి
- తల్లాప్రగడ మల్లికార్జున రావు
- దుప్పల వెంకట రమణ