Friday, November 22, 2024

Omicron: ఏపీలో మరో ఏడుగురికి ఒమిక్రాన్.. కృష్ణా జిల్లాలో మూడు కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్రంలో ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరు ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మిగతా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు తెలిపింది.

ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. కృష్ణా జిల్లాలో తొలిసారిగా మూడు ఓమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు రాష్ట్రానికి వచ్చిన వారికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పు గోదావరిలో ఒమిక్రాన్ వ్యాధి సోకిన వారిలో ఒకరు ఒమన్ తిరిగి వచ్చిన వ్యక్తి కాగా, మరొకరు UAE నుంచి తిరిగి వచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement