Friday, November 22, 2024

ఆయిల్ అక్ర‌మ అమ్మకాల‌పై సీరియ‌స్.. మెరుపుదాడులు చేయాల‌న్న మంత్రి

అమరావతి, ఆంధ్రప్రభ: వంటనూనెల ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో పౌరసరఫరాల శాఖ మరియు కార్పొరేషన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరల నియంత్రణ, పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాడ్లాడుతూ, నిత్యావసర సరుకులను , ముఖ్యంగా వంట నూనెలను నిర్ధేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసిన బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజలకు వంటనూనెలు, నిత్యావసర సరకుల ధరల విషయంలో ఎటు-వంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకునే బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉందన్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రైతు బజారులు, మున్సిపల్‌ మార్కెట్‌ల ద్వారా ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు- చేసి మార్కెట్‌ ధరకన్నా తక్కువ ధరకు వంటనూనెలు అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లానింగ్‌ డిపార్ట్మెంట్‌ అందిస్తున్న నివేదికల ఆధారంగా మండలాల వారీగా ఉన్న వంటనూనె ధెరలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని , క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు అర్ధం చేసుకొని , నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని అన్నారు..ఎక్కడ కూడా అధికారులు సామన్య ప్రజలకు మేలు జరిగే విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని అన్నారు.ప్రముఖ బ్రాండ్‌ ల తయారీ ఉత్పత్తి దారులతో సమావేశాలు నిర్వహించాలని, ఇంపోటర్స్‌, స్లపయర్స్‌ తో సమావేశాలు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.. లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement