కర్నూలు, (ప్రభ న్యూస్) : కొన్ని మండలాల్లో వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని వెంటనే రిపోర్టులు తెప్పించుకొని బాధితులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ భరత్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ భరత్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో వర్షంతో కొన్ని మండలాలలో పంటలు నష్టం జరిగిందన్నారు. రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా పారదర్శకంగా ప్రొక్యూర్మెంట్ జరగాలన్నారు. గన్నీ బ్యాగులు రైతులకు చేరాయో లేదా ఎంక్వైరి చేయాలని సివిల్ సప్లై డిఎంను సూచించారు.
నకిలి విత్తనాలు అమ్మకాలు జరిపే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గడివేముల మండలంలో కొంత మంది రైతులు మొక్కజొన్న నకిలి విత్తనాలు కొని తీవ్రంగా నష్టపోయారని సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశంపై కలెక్టర్ స్పందించి నకిలీ విత్తనాల విక్రయిస్తున్న వారిపై ఒక టీంను పంపించి ఎంక్వైరి చేయించాలని వ్యవసాయ శాఖ జెడిను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పెసరవాయి, ఇందుకూరు గ్రామాల రైతులు మొక్కజొన్న నకిలీ విత్తనాలు కొన్ని రైతులు తీవ్రంగా నష్టపోయారని, మోసం చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు.
సమావేశంలో నంద్యాల ఎంపి పోచ బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ వంగల భరత్ కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్, తమీమ్ అన్సారియీ, వ్యవసాయశాఖ జేడీఏ వరలక్ష్మి, ఏపీఎంఐపి పీడీ ఉమాదేవి, పశు సంవర్థకశాఖ జెడి రమణయ్య, సివిల్ సప్లై డీఎం వ్యవసాయ, ఉద్యాన ఏపీఎంఐపీ, పశుసంవర్థక తదితర శాఖ అధికారులు వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..