ఏపీ సీఎం జగన్ మెహన్ రెడ్డి ఆదేశాలతో కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగులను బెదిరించిన కేసులో వైఎస్ కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణకు ప్రతిపాదనలను పంపామని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇవ్వాల ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ఎస్.పి తెలిపారు. వై.ఎస్.కొండారెడ్డిపై ఎస్.ఆర్.కె కంస్ట్రక్షన్స్ కంపెనీ ఉద్యోగులను బెదిరించిన కేసుతో పాటు పలు కేసులున్నాయన్నారు.
అదేవిధంగా జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డా.. అవినీతి, అక్రమాల విషయం తెలిసినా వెంటనే అవినీతి నిరోధక శాఖ ఫోన్ నెంబర్ 14400 కాని, డయల్ 100 కు కానీ, లేదా తన ఫోన్ నెంబర్ 940796900కు అయినా ఫోన్ చేసి చెప్పొచ్చని ఎస్పీ సూచించారు. దీంతో ఎవరైనా కానీ చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడ్డవారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు.