ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో అర్ధరాత్రి మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చాలాకాలంగా మట్టి, ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే.. ఇవ్వాల (సోమవారం) రాత్రి కొంతమంది సబ్‌కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సోమవారం రాత్రి ముసునూరు మండలం గోపవరం గ్రామంలో మట్టి అక్రమ రవాణాపై సీరియస్ అయ్యారు. గ్రామంలోని మాకినేనివారి చెరువులో మట్టి అక్రమంగా రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను, ఒక జేసీబీని సీజ్ చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు మీడియాకు తెలిపారు. కాగా, గ్రామాల్లో మట్టి , ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.