ముంబైలో సెరెంటికా గ్లోబల్ కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన కంపెనీ ప్రణాళికలపై చర్చించారు. వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ సెరెంటికా గ్లోబల్ పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు మంత్రి లోకేష్ తెలిపరు.
2030 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు సెరెంటికా గ్లోబల్ వంటి కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నట్లు లోకేష్ వివరించారు.