Tuesday, November 19, 2024

సీనియ‌ర్ ఐఏఎస్‌ రంగంలోకి.. నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గా ఎంవీజీకే భాను?!

నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంవీజీకే భాను రంగంలో ఉంటారని తెలుస్తోంది. అస్సాంలో సీనియర్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. అంతేకాకుండా మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌తో సన్నిహితంగా ఉంటార‌న్న పేరు ఉంది. నవంబర్ 2011లో మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం ఎగువ అస్సాంలోని జోర్హాట్‌లో జరిగిన వరల్డ్ టీ సైన్స్ కాంగ్రెస్‌కు హాజ‌రైన‌ప్పుడు అప్పటి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ MGVK భాను ప్రసంగాన్ని విన్నారు. తర్వాత కలాం అత‌డిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. “భారత్‌ను టీ ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా మార్చినందుకు తాను భానుని గుర్తుంచుకోవాలని అనుకుంటున్నా.. ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఎగుమతిదారు. అని క‌లాం కొనియాడారు. 1985 బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ కేడర్ IAS అధికారి అయిన భాను ముందుచూపు ఉన్న వ్యక్తి అని అప్ప‌టి రాష్ట్ర పతి అబ్దుల కలాం చేత ప్రశంసలు పొందారు.

1958లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు భాను. 2019 వరకూ అసోం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తేజ్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
అంతేకాకుండా డైనమిక్ అధికారిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి కూడా ప్రశంసలు పొందిన నోబుల్ అధికారి. అత్యంత ప్రభావవంతమైన అధికారులలో ఒకరిగా ఆయ‌న పేరుగాంచారు. టీ బోర్డ్‌లో పని చేయడంతో పాటు, అతను ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్‌పై కూడా వెళ్ళారు. 1990 లో విజయవాడ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా పనిచేసి సుందర నగరంగా తీర్చి దిద్దారు. భాను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డికి, కె.రోశయ్యకు కార్యదర్శిగా వ్య‌వ‌హ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement