Saturday, November 23, 2024

సెమీ హైస్పీడ్‌ రైళ్లు వచ్చేస్తున్నయ్‌.. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ.. ‘హువ్టూ’ ఆధ్వర్యంలో ప్రాజెక్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌- విజయవాడ పట్టణాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైళ్లు రయిమని దూసుకుపోయేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ యూనిఫైడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(హువ్టూ) ఈ రైళ్ల సౌకర్యం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ప్రి ఫీజబులిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి టెండర్లు పిలిచింది. హెచ్‌ఎండీఏ లెక్స్‌ విభాగం ఎస్‌ఈ ఈ-టెండర్లు పిలిచారు.

ఓపెన్‌ బిడ్‌ పద్ధతిలో పిలిచిన ఈ-టెండర్లకు ఏప్రిల్‌ 18 చివరి తేదీ అని తెలిపింది. ఏప్రిల్‌ 1వ తేదీన ప్రి-బిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ బిడ్‌కు రూ.15 వేల ఈఎండీని నిర్ణయించగా, ప్రాసెస్‌ ఫీజుగా రూ.25 వేలు నిర్ణయించారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియాలో ప్రజా రవాణా ప్రాజెక్టుల రూపకల్పన, అమలుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ఎస్పీవీ)గా ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హువ్టూను ఏర్పాటు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement