మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ
వెలగపూడి – రాష్ట్రంలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) కీలక ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో నేడు ఎంఓయూ కుదిరింది.
ప్రముఖ సామాజిక సంస్థ అయిన స్వనీతి ఇనిషియేటివ్ రాష్ట్రంలో పౌరసేవలను మెరుగుపరిచి, అట్టడుగువర్గాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పన చేస్తుంది. పరిశోధన, డేటా, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో అనుభవం కలిగిన స్వనీతి ఇనియేటివ్ సంస్థ సమాజంలో వెనుకబాటుకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం కృషిచేస్తోంది. స్కిల్లింగ్‌కు సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌కు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంది. కీలకమైన రంగాలు, పరిశ్రమలను గుర్తించి, స్థిరమైన జాబ్ మార్కెట్‌ను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది.
ఈ కార్యక్రమంలో స్వనీతి ఇనిషియేటివ్ ట్రస్టీ ఉమా భట్టాచార్య, స్టేట్ కన్సల్టెంట్ శివప్రసాద్, అసోసియేట్ తేజ సరియం, పాఠశాల విద్య, స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ గణేశ్ కుమార్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్ కుమార్ పాల్గొన్నారు.