Monday, November 25, 2024

Self Employment – నిరుద్యోగి కిరాణ అండ్ జ‌నర‌ల్ స్టోర్స్…. ఎక్క‌డో తెలుసుకుందాం..

విజ‌య‌న‌గ‌రం – ఇంజ‌నీరింగ్ ప‌ట్టాతో పాటు పని అనుభవమూ ఉంది. అయినా తగిన ఉద్యోగమే ఎపిలో దొరక‌లేదు. దీంతో జీవనోపాధి కోసం కిరాణం పెట్టుకున్న ఆ నిరుద్యోగి తన గోడును దుకాణానికి పేరుగా మార్చుకున్నారు. వివ‌రాల‌లోకి వెళితే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన దత్తి వెంకటరమణ మాత్రం తన ఇంటి వద్దే చిరు దుకాణం ఏర్పాటు చేశారు.

షాపునకు ‘నిరుద్యోగి కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌’ అని పేరు పెట్టారు. ‘ఐటీఐ, బీటెక్‌తో పాటు డిగ్రీ పూర్తి చేశా. రైల్వేలో అప్రెంటీస్‌ చేశా. ప్రాంగణ ఎంపికల్లో రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే ఇస్తామన్నారు. ఉద్యోగ ప్రకటనలు లేకపోవడంతో ఏడాది కిందట దుకాణం పెట్టా. నా బాధ ప్రభుత్వానికి అర్థం కావాలనే దుకాణం పేరు ఇలా పెట్టా’ అని వివరించారు. విద్యార్హత‌లున్నా మంచి జీతంతో ఉద్యోగం రాక‌పోవ‌డమే ఈ దుకాణం ఏర్పాటుకు స్ఫూర్తి అన్నాడు వెంక‌ట ర‌మ‌ణ‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement